నీట్‌ను పూర్తిగా రద్దు చేయండి: తమిళనాడు సీఎం విజయ్
ABN , Publish Date - May 13 , 2026 | 09:35 PM
నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు మెడికల్ అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు మెడికల్ అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 'ఇది నీట్ పరీక్షలో జరిగిన మొదటి అవకతవక కాదు. పదేపదే జరుగుతున్న వివాదాలు ఈ పరీక్షా విధానంలో ఉన్న లోపాలను బయటపెడుతున్నాయి' అని విజయ్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు (Vijay NEET).
ఈ పరీక్షతో గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమానికి చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విజయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని విజయ్ కోరారు. తమిళనాడు చాలా కాలంగా నీట్ పరీక్షకు వ్యతిరేకంగా పోరాడుతోందని విజయ్ గుర్తు చేశారు (NEET abolition).
కోచింగ్ సెంటర్లపై ఆధారపడే విద్యార్థులకు మాత్రమే నీట్ పరీక్ష ఉపయోగపడుతోందని, సాధారణ కుటుంబాల పిల్లలకు ఇది కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు (Tamil Nadu NEET row). రాష్ట్రంలోని విద్యా సమానత్వానికి నీట్ ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ప్రశ్నాపత్రం లీక్ కావడంతో నీట్ పరీక్ష రద్దు అయిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు
ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..