Share News

భారత ప్రయోజనాలకు నష్టం వాటిల్లనివ్వం: రష్యా

ABN , Publish Date - May 13 , 2026 | 06:53 PM

ఇంధన సరఫరా విషయంలో భారత ప్రయోజనాలకు నష్టం జరగనివ్వబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హామీనిచ్చారు. ఇంధన సరఫరాకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ నెరవేర్చుతామన్నారు. త్వరలో భారత పర్యటనకు రానున్న లావ్రోవ్ ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

భారత ప్రయోజనాలకు నష్టం వాటిల్లనివ్వం: రష్యా
Russia India oil supply

ఇంధన సరఫరా విషయంలో భారత ప్రయోజనాలకు నష్టం జరగనివ్వబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హామీనిచ్చారు. ఇంధన సరఫరాకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ నెరవేర్చుతామన్నారు. త్వరలో భారత పర్యటనకు రానున్న లావ్రోవ్ ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్, రష్యాల మధ్య సంబంధాలు స్నేహంపై ఆధారపడి ఉన్నాయని, వాటి దారులు వేరయ్యే పరిస్థితి ఎప్పటికీ ఉండదని స్పష్టం చేశారు (Russia India oil supply).


'ఇంధన సరఫరా విషయంలో భారత ప్రయోజనాలకు నష్టం జరగనివ్వం. చమురు సరఫరాలో ఆటంకం కలగనివ్వం. భారత అవసరాల దృష్ట్యా గ్యాస్, చమురు, బొగ్గు వంటివి సరఫరా చేస్తూనే ఉంటాం. భారత్-రష్యా బంధాలను బలహీనపరిచేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాల పట్ల ఇరు దేశాలు అప్రమత్తంగా ఉండాలి. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం కోసం కొత్త పవర్ యూనిట్ల నిర్మాణంలో మా సహకారం కొనసాగుతుంది' అని లావ్రోవ్ తెలిపారు (Russian crude oil India).


'హిందూ-రూసీ భాయ్ భాయ్ అనేది మన సంస్కృతిలో ఒక భాగం (India energy security). భారతీయ సినిమాలు, రాజ్ కపూర్, టెలివిజన్ సిరీస్‌లకు రష్యాలో ఎంతో ఆదరణ ఉంది. సైనిక సహకారం, ఇంధన సరఫరాలు, ఆర్థిక వ్యవస్థ.. ఇలా ఎన్నో రంగాల్లో ఇరు దేశాల మధ్య బంధం చాలా దృఢంగా ఉంది. అది ఎప్పటికీ కొనసాగుతుంది' అని లావ్రోవ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు


ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..

Updated Date - May 13 , 2026 | 07:28 PM