Share News

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదేమో: ఆర్బీఐ గవర్నర్

ABN , Publish Date - May 13 , 2026 | 05:48 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదేమో: ఆర్బీఐ గవర్నర్
RBI Governor

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్‌లోని స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు (Petrol price hike India).


అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఎక్కువకాలం ఇదే స్థాయిలో కొనసాగితే ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపక తప్పదని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. ప్రస్తుతం చమురు కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, చమురు కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరలను నియంత్రిస్తున్నాయని చెప్పారు. అయితే ఇది ఎంతకాలం సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకమని అన్నారు (RBI Governor).


ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉందని (Fuel inflation), దీంతో వడ్డీ రేట్లు, వినియోగదారుల ఖర్చులు, రవాణా వ్యయం వంటి అంశాలపై ప్రభావం పడొచ్చని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది. బంగారం, వెండి దిగుమతి సుంకాలను 15 శాతానికి పెంచడం, ఇంధన వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రజలకు పిలుపునివ్వడం వంటి చర్యలు తీసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు


ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..

Updated Date - May 13 , 2026 | 06:02 PM