Share News

హిందూమతం ఓ జీవన విధానం.. తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి..: సుప్రీంకోర్టు

ABN , Publish Date - May 13 , 2026 | 05:28 PM

హిందూ మతం ఒక జీవన విధానమని, ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఆలయానికి వెళ్లడం, ఆచారాలను పాటించడం తప్పనిసరేం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో మహిళల ప్రవేశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

హిందూమతం ఓ జీవన విధానం.. తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి..: సుప్రీంకోర్టు
Supreme Court Hinduism

హిందూ మతం ఒక జీవన విధానమని, ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఆలయానికి వెళ్లడం, ఆచారాలను పాటించడం తప్పనిసరేం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో మహిళల ప్రవేశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆలయాలకు వెళ్లకపోయినా, ఇంట్లో దీపం వెలిగించుకుంటే అంది హిందూమతంపై విశ్వాసాన్ని సూచిస్తుందని పేర్కొంది (Supreme Court Hinduism).


సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసింది (Hinduism way of life). హిందూమతం అనేది ఒక జీవన విధానమని, తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఆలయాలకు వెళ్లాలనే నిబంధనం లేదని పేర్కొన్నారు. ప్రతి మత ఆచారాన్ని, మత సంబంధ విషయాలను న్యాయస్థానం ముందు ప్రశ్నించడం ప్రారంభిస్తే.. వందలాది పిటిషన్లు వస్తాయని రాజ్యంగ ధర్మాసనం పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు


ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..

Updated Date - May 13 , 2026 | 05:38 PM