Share News

నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్..

ABN , Publish Date - May 13 , 2026 | 04:00 PM

వరుసగా రెండు రోజులు భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఉదయం భారీ నష్టాల్లో కొనసాగినా మధ్యాహ్నం కోలుకున్నాయి.

నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్..
Stock Market

వరుసగా రెండు రోజులు భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఉదయం భారీ నష్టాల్లో కొనసాగినా మధ్యాహ్నం కోలుకున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసి వచ్చింది. అలాగే అంతర్జాతీయంగా కాపర్ ధరలు పెరగడంతో మెటల్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (74,559)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు వెళ్లింది. అయితే మధ్యాహ్నం తర్వాత సూచీలు కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ ఒక దశలో 1000 పాయింట్లు పైకి వచ్చింది. చివరకు సెన్సెక్స్ 49 పాయింట్ల లాభంతో 74,608 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 33 పాయింట్ల లాభంతో 23,412 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో సెయిల్, డిక్సన్ టెక్నాలజీస్, వొడాఫోన్ ఐడియా, వేదాంత, మనప్పురం ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). మ్యాక్స్ ఫైనాన్సియల్స్, టాటా పవర్, పేటీఎమ్, కేఫిన్ టెక్సాలజీస్, ఎయిచర్ మోటార్స్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 99 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 460 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.70)గా ఉంది.


ఇవి కూడా చదవండి..

ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు


ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..

Updated Date - May 13 , 2026 | 04:05 PM