Share News

గూగుల్ ఆండ్రాయిడ్ షో.. జెమినీ ఏఐ, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు ప్రకటించిన గూగుల్..

ABN , Publish Date - May 13 , 2026 | 03:49 PM

టెక్ దిగ్గజం గూగల్ తన 'ఆండ్రాయిడ్ షో ఎడిషన్ 2026' కార్యక్రమంలో భారీ అప్‌డేట్లను ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఎకో‌సిస్టమ్‌ను మరింత ఏఐ ఆధారితంగా మార్చే దిశగా కంపెనీ కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 16, జెమినీ ఏఐ, ఆండ్రాయిడ్ ఆటో, క్విక్ షేర్ వంటి సేవల్లో కీలక ఆప్‌డేట్‌లను తీసుకువచ్చింది.

గూగుల్ ఆండ్రాయిడ్ షో.. జెమినీ ఏఐ, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు ప్రకటించిన గూగుల్..
Google Android Show 2026

టెక్ దిగ్గజం గూగల్ తన 'ఆండ్రాయిడ్ షో ఎడిషన్ 2026' కార్యక్రమంలో భారీ అప్‌డేట్లను ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఎకో‌సిస్టమ్‌ను మరింత ఏఐ ఆధారితంగా మార్చే దిశగా కంపెనీ కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 16, జెమినీ ఏఐ, ఆండ్రాయిడ్ ఆటో, క్విక్ షేర్ వంటి సేవల్లో కీలక ఆప్‌డేట్‌లను తీసుకువచ్చింది. గూగుల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ (I/O) మే 19, 20 తేదీలలో జరగనుంది. దానికి ముందుగా జరిగిన 'ది ఆండ్రాయిడ్ షో: ఎడిషన్'లో గూగుల్ ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ల ప్రివ్యూను అందించింది (Google Android Show 2026).


గూగుల్ ప్రకటించిన వాటిల్లో ముఖ్యమైనది.. ఐఫోన్ యూజర్లకు కూడా క్విక్ షేర్ అందుబాటులోకి రానుండడం. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఎయిర్‌డ్రాప్ తరహాలో ఫైళ్లను నేరుగా ఐఫోన్‌లకు పంపగలరు. ఈ ఫీచర్ పిక్సెల్ 10 సిరీస్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎంపిక చేసిన శాంసంగ్, ఒప్పో, వన్‌ప్లస్, వివో, షియోమి, హానర్ ఫోన్‌లలో కూడా పని చేస్తుంది (Quick Share improvements).


ఇక, ఈ ఈవెంట్‌లో జెమినీ ఏఐ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జెమినీ ఏఐ, యూజర్ అవసరాలను ముందుగానే అర్థం చేసుకుని పనులను సులభతరం చేస్తుంది. ఈ ఐఏ ఫీచర్లు ఫోన్లు, కార్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక, ఆండ్రాయిడ్‌లో క్రోమ్‌ను జెమినీ ఏఐ మరింత స్మార్ట్‌గా మార్చబోతోంది. జెమిని 3.1ని ఉపయోగించి క్రోమ్ ఎన్నో సంక్లిష్టమైన పనులను సులభంగా పూర్తి చేయగలుగుతుంది (Gemini AI).


అలాగే ఆండ్రాయిడ్ ఆటోకు కూడా భారీ అప్‌డేట్లు ప్రకటించారు. జెమినీ ఏఐ ఇంటిగ్రేషన్, 3డీ గూగుల్ మ్యాప్ నావిగేషన్, వాహనాలలో యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ సపోర్ట్, వాహన స్క్రీన్‌లకు అనుగుణంగా యూఐ మార్పులు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే ఆండ్రాయిడ్ 16లో ఎన్నో సరికొత్త ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయి (Android Auto update).


ఇక, 'స్క్రీన్ రియాక్షన్స్' అనే కొత్త ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు తమ స్క్రీన్‌ను, తమ మొహాన్ని ఒకే సమయంలో రికార్డ్ చేయవచ్చు. ఇది ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు, కంటెంట్ క్రియేటర్లకు ఒక పెద్ద వరం అని చెప్పొచ్చు. ఈ ఫీచర్లు అన్నీ మొదటగా పిక్సెల్ ఫోన్‌లకు వస్తాయి. ఆ తర్వాత మిగిలన ఫోన్లలో కూడా అప్‌డేట్ అవుతాయి.


ఇవి కూడా చదవండి..

ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు


ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..

Updated Date - May 13 , 2026 | 04:02 PM