Share News

హిల్ రీడ్జ్ విల్లా దోపిడి కేసును 24 గంటల్లో ఛేదించాం: డీసీపీ

ABN , Publish Date - Jun 09 , 2026 | 07:41 PM

గచ్చిబౌలిలోని హిల్ రీడ్జ్ విల్లాలో దోపిడి కేసును 24 గంటల్లో ఛేదించామని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ దోపిడికి పాల్పడిన ఇద్దరు నేపాలీ దొంగలను ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేశామన్నారు.

హిల్ రీడ్జ్ విల్లా దోపిడి కేసును 24 గంటల్లో ఛేదించాం: డీసీపీ
Nepali Robbery

హైదరాబాద్, జూన్09: గచ్చిబౌలిలోని హిల్ రీడ్జ్ విల్లాలో దోపిడి కేసును 24 గంటల్లో ఛేదించామని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ దోపిడికి పాల్పడిన ఇద్దరు నేపాలీ దొంగలను ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 7 కిలోల బంగారంతోపాటు కిలోన్నర వెండి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ దోపిడి జరిగిన వెంటనే ఫిర్యాదు అందడంతో.. ఆరు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నిందితులకంటే ముందే భారత్, నేపాల్ సరిహద్దుల్లోకి ఆయా బృందాలు చేరుకున్నాయని వివరించారు. తద్వారా నిందితులను అరెస్ట్ చేయడం సులువైందన్నారు.


బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని న్యాయస్థానంలో నిందితులను హాజరు పరిచి అనంతరం హైదరాబాద్‌కు తీసుకోస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇంట్లో నేపాలీ పని మనుషులను పెట్టుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు డీసీపీ సూచించారు. హిల్ రీడ్జ్ విల్లాలో ఇంటి ఓనర్లు బయటకు వెళ్లే సమయంలో లాకర్ కీ దాచే ప్రదేశాన్ని నేపాలీ పని మనిషి దంపతులు ముందుగా గుర్తించారని తెలిపారు.


అలా ఇంట్లో యజమానులు లేని సమయంలో ఈ దంపతులు లాకర్ ఓపెన్ చేసి బంగారం, వెండి చోరీ చేశారని వివరించారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టి దోపిడి దొంగలను అరెస్ట్ చేశారని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కిషన్ రెడ్డి

అందుకే తెలంగాణ వడ్లను కేంద్రం కొనుగోలు చేయడం లేదు: మంత్రి ఉత్తమ్

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 08:05 PM