Share News

భాగ్యనగరంలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు..

ABN , Publish Date - Sep 14 , 2026 | 07:13 AM

భాగ్యనగర వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, మెహదీపట్నం, హిమాయత్‌నగర్, నారాయణగూడ, అంబర్‌పేటలో కుంభవర్షం పడుతోంది.

భాగ్యనగరంలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు..
Rains in Hyderabad

హైదరాబాద్: భాగ్యనగర వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, మెహదీపట్నం, హిమాయత్‌నగర్, నారాయణగూడ, అంబర్‌పేటలో కుంభవర్షం పడుతోంది. మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, గోషామహల్, బంజారాహిల్స్, షేక్‌పేట్, రాయదుర్గం, గచ్చిబౌలిలో వాన కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, యూసుఫ్‌గూడ, టోలీచౌకీ, మణికొండ ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాండ్లాపూర్‌ రైతుల దీక్ష భగ్నం

వారంలోనే ఇందిరమ్మ టవర్స్‌ ఇళ్ల పత్రాలిస్తాం

Updated Date - Sep 14 , 2026 | 07:14 AM