Share News

పీఎం శ్రీ’ కింద 832 పాఠశాలల అభివృద్ధి

ABN , Publish Date - Sep 14 , 2026 | 06:34 AM

‘పీఎం శ్రీ’ పథకం కింద తెలంగాణలో 832 పాఠశాలలను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

పీఎం శ్రీ’ కింద 832 పాఠశాలల అభివృద్ధి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘పీఎం శ్రీ’ పథకం కింద తెలంగాణలో 832 పాఠశాలలను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రతి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మలిచి, విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తున్నామని చెప్పారు. పీఎం శ్రీ పాఠశాలల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ తరగతులు ఏర్పాటుచేసి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా రూ.27,360కోట్లతో 14,500పైగా పాఠశాలలను పీఎం శ్రీ పాఠశాలలుగా తీర్చిదిద్దుతున్నట్లు కిషన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Sep 14 , 2026 | 06:37 AM