Share News

సినిమా సైల్‌లో బంగారం స్మగ్లింగ్.. చివరకు డీఆర్ఐ వలలో చిక్కిన ముఠా

ABN , Publish Date - Nov 21 , 2026 | 09:04 PM

విదేశీ బంగారాన్ని భారీగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠా డీఆర్ఐ అధికారుల వలలో చిక్కింది. 2.98 కేజీల బంగారాన్ని కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సినిమా సైల్‌లో బంగారం స్మగ్లింగ్.. చివరకు డీఆర్ఐ వలలో చిక్కిన ముఠా
hyderabad gold smuggling

హైదరాబాద్, నవంబరు 21: విదేశీ బంగారాన్ని పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠా డీఆర్ఐ అధికారుల వలలో చిక్కింది. రూ. 3.83 కోట్ల విలువైన 2.98 కేజీల బంగారాన్ని సినీ ఫక్కీలో కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..


పోలీసుల కథనం ప్రకారం.. చాలా చాకచక్యంగా 2.98 కేజీల బంగారాన్ని తరలిస్తున్న ఓ ముఠా ఎత్తుగడను డీఆర్ఐ అధికారులు చిత్తు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా కారు టెయిల్ ల్యాంప్ వెనుక ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరలో.. బంగారాన్ని తరలించాలన్న వారి ప్లాన్‌ను ఛేదించి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


కియో సెల్టోస్ కారులో భారీ మొత్తంలో అనుమతిలేని బంగారాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారం అందుకున్న అధికారులు.. వాహనాన్ని అడ్డగించడంతో దుండగులు ఖంగుతిన్నారు. వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. రహస్య అర గుట్టను రట్టుచేశారు. కారు టెయిల్ ల్యాంప్ వెనుక ప్రత్యేకంగా తయారు చేసిన అరలో.. బ్రౌన్ కలర్ టేపులో చుట్టిన మూడు బంగారు బిస్కెట్ల ప్యాకెట్లను గుర్తించారు.

బంగారు బిస్కెట్లపై విదేశీ గుర్తులను కూడా దుండగులు చెరిపి వేసినట్లు అధికారులు గుర్తించారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన ఈ మొత్తం బంగారం దాదాపు రూ. 3.83 కోట్ల విలువైనదిగా గుర్తించారు. కాగా.. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి.. బంగారాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అనే కోణంలో డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..

ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?

Updated Date - Nov 21 , 2026 | 09:10 PM