Share News

అండాల దానం ముసుగులో మహిళల అక్రమ రవాణా?

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:27 AM

అండాల అక్రమ సేకరణపై పోలీసులు దర్యాప్తును విస్తృతం చేశారు.

అండాల దానం ముసుగులో మహిళల అక్రమ రవాణా?

  • ఇతర రాష్ట్రాల నుంచి ఏ హామీలిచ్చి తీసుకొచ్చారు?

  • దీంట్లో వ్యవస్థీకృత ముఠాలున్నాయా?.. పోలీసుల దర్యాప్తు

  • ఫోరెన్సిక్‌ విశ్లేషణకు ఒయాసిస్‌ హాస్పిటల్స్‌ ల్యాప్‌టాప్‌లు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అండాల అక్రమ సేకరణపై పోలీసులు దర్యాప్తును విస్తృతం చేశారు. ఈ వ్యవహారంలో వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను అక్రమంగా రవాణా చేసి తీసుకొచ్చి అండాలు సేకరించారా? వారికి డబ్బు ఆశ చూపారా? నకిలీ పత్రాలను తయారు చేసి వినియోగించారా? వ్యవస్థీకృత ముఠాలు, మధ్యవర్తులు, సంస్థల ప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఈ కేసులో పలు ఫర్టిలిటీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకులు, వాటి ప్రతినిధులు, మధ్యవర్తుల ప్రమేయంపై సందేహాలున్నాయని, ఈ దిశగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే అరెస్టయిన నిందితుడు ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో కొత్త ఆధారాలు లభించడంతో, మరిన్ని వివరాల కోసం అతడిని అదనపు కస్టడీలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.


మహిళలను వివిధ ఏఆర్టీ బ్యాంకులు, ఫర్టిలిటీ కేంద్రాలకు పరిచయం చేయడంలో దుర్గాప్రసాద్‌ పాత్రతోపాటు, అతడికి ఉన్న పరిచయాలు, ఆర్థిక లావాదేవీలు, సహచరుల వివరాలపై లోతుగా ఆరా తీస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని ఒయాసిస్‌ హాస్పిటల్స్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్‌ పరికరాలు, డోనర్‌ రిఫరల్స్‌కు సంబంధించిన రికార్డులు, పత్రాలను, ఆర్థిక లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, స్వాధీనం చేసుకున్న వాటిని ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపిస్తున్నారు. మహిళల రిక్రూట్‌మెంట్‌, రిఫరల్‌ కోసం వ్యవస్థీకృత కమీషన్‌ విధానం అమలులో ఉందా? నిర్వహణ సంస్థల బాధ్యులు, డైరెక్టర్లు, కోఆర్డినేటర్లు, ఏజెంట్ల పాత్ర ఏమిటి? అన్నది పరిశీలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 05:27 AM