Share News

హైదరాబాద్ మియాపూర్‌లో డ్రగ్స్ కలకలం

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:22 PM

హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్‌‌వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12.6 గ్రాముల ఎమ్‌డీఎమ్ఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ మియాపూర్‌లో డ్రగ్స్ కలకలం
Hyderabad Drugs Case

హైదరాబాద్, మార్చి 4: మియాపూర్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా.. ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో డ్రగ్ పెడ్లర్ హనుమంతుతో పాటు డ్రగ్స్ వినియోగిస్తున్న మహేష్, ఆదర్శ్‌లను అదుపులోకి తీసుకున్నారు.


వారి నుంచి సుమారు 12.6 గ్రాముల ఎమ్‌డీఎమ్ఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ మార్కెట్ విలువ దాదాపు 1.5 లక్షల రూపాయలుగా అంచనా. దర్యాప్తులో ఈ ముఠా నైజీరియన్‌ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల

భూములు కోల్పోయే రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాం: మంత్రులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 04:04 PM