హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసు.. ముగ్గురి అరెస్ట్
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:16 PM
హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌లు చోరీ చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 60 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 16: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (Hyderabad Central University) ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు చేధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఆర్ రావు ఏఐఎమ్‌సీఎస్ విభాగం టార్గెట్‌గా చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. చోరీలో కూకట్‌పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్‌ని (30) ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మిగిలిన ఇద్దరు సాయి చరణ్ (19), అశ్విన్ రావు (19)లను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ విద్యార్థులే.
యూనివర్సిటీ భద్రతా వ్యవస్థ గురించి సరైన అవగాహనతో, అర్ధరాత్రి సమయంలో దుండగులు లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేసి.. నిందితులను గుర్తించి, అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 60 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీకి ఉపయోగించిన 2 కార్లు, 3 సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. ఈ కేసులో నిందితులను రిమాండ్‌కు తరలించారు గచ్చిబౌలి పోలీసులు. యూనివర్సిటీ క్యాంపస్‌లో భద్రతా లోపాలపై కూడా దృష్టి సారించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తం..
గన్నవరంలో బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం..
Read Latest Telangana News And Telugu News