Share News

బంజారాహిల్స్‌లో భారీ చోరీ చేసి.. గోవా క్యాసినోలో దొరికిపోయాడు

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:03 AM

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రముఖ మద్యం వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి గౌరేష్‌గా గుర్తించారు.

బంజారాహిల్స్‌లో భారీ చోరీ చేసి.. గోవా క్యాసినోలో దొరికిపోయాడు

హైదరాబాద్, సెప్టెంబర్ 09: నగరంలోని బంజారాహిల్స్‌లో ప్రముఖ మద్యం వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి గౌరేష్‌గా గుర్తించారు. గోవాలో క్యాసినో అడుతున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గౌరేష్ వద్ద నుంచి బంగారు నగలతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్‌కు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తీసుకొచ్చారు.


నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని వ్యాపారి ఇంట్లో పది తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. దీనిపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. చోరీకి గురైన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. అలాగే పాత నేరస్తుల కదలికపై పోలీసులు నిఘా ఉంచారు. కనుబొమ్మపై గాయం మచ్చ ఉన్న వ్యక్తిని ఈ సందర్భంగా సీసీటీవీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు.


ఈ చోరీకి పాల్పడింది అతడేనని పోలీసులు నిర్ధారించారు. గతంలో మాదాపూర్‌లో చోరీ కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడని పోలీసులు గుర్తించారు. అతడి స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెందుర్తి అని తెలిపారు. అతడి పేరు గౌరేష్‌ అని చెప్పారు. జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తూ బంజారాహిల్స్‌ ఇంద్రానగర్‌లో నివసిస్తున్నాడని వివరించారు. ఈజీ మనీ కోసం అతడు ఈ చోరీలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ఈ చోరీ చేసిన బంగారంలో కొంత విక్రయించాడని చెప్పారు. ఆ నగదుతోనే గౌరేష్ విమానంలో గోవా వెళ్లాడని పోలీసులు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ అరాచక పాలన అంతానికి నాంది పలికిన చారిత్రక సందర్భం: మంత్రి అనగాని

రైలు ప్రయాణమంటే ఇంత సాహసం చేయాలా?.. వీడియో వైరల్

For TG News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 11:29 AM