శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం.. క్యాన్సర్ బాధిత బాలిక మృతి..
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:41 PM
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ (శనివారం) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇథియోపియా నుంచి క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్న ఓ బాలిక మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ (శనివారం) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇథియోపియా నుంచి క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్న ఓ బాలిక మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రయాణ సమయంలో బాలిక ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమాన సిబ్బంది అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు విమానం ల్యాండైన వెంటనే బాలికను శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే బాలిక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విమానాశ్రయంలో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారి తల్లిదండ్రుల రోదనలు ఎయిర్‌పోర్టు ఆవరణలోని ప్రయాణికుల హృదయాలను కలిచివేశాయి. బాలిక మృతికి గల కచ్చితమైన కారణాలపై వైద్యులు, సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్న అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు
మన వాళ్ల హక్కులను కాపాడటంలో వెనక్కు తగ్గేదేలే..: కవిత