పొగమంచులోనూ విమాన సర్వీసులు
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:45 AM
పొగ మంచు కురుస్తున్నా.. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసుల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.
శంషాబాద్ విమానాశ్రయంలో క్యాట్-111 సదుపాయం
శంషాబాద్‌రూరల్, నవంబరు10 (ఆంధ్రజ్యోతి): పొగ మంచు కురుస్తున్నా.. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసుల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. రన్‌వే 09 ఆర్‌పై క్యాట్-111 ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ వసతిని అందుబాటులోకి తెచ్చింది. పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విమానాల రాకపోకల నిర్వహణ కు వీలవుతుంది. ఇప్పటివరకు ఉన్న క్యాట్-11 సామర్థ్యాన్ని క్యాట్-111 స్థాయికి అప్‌గ్రేడ్ చేయడంతో పొగమంచు వల్ల విమానాల ఆలస్యాలు, మళ్లింపులు తగ్గనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News