Share News

కొలిక్కివచ్చిన హ్యామ్‌ రోడ్లకు హడ్కో రుణం

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:26 AM

ఆర్‌అండ్‌బీ పరిధిలోని హ్యామ్‌ రోడ్ల పనుల కోసం హడ్కో నుంచి తీసుకోదల్చిన రుణం విషయం ఒక కొలిక్కి వచ్చింది.

కొలిక్కివచ్చిన హ్యామ్‌ రోడ్లకు హడ్కో రుణం
HUDCO

  • ప్రతిపాదిత వడ్డీ రేటు తగ్గించేందుకు హడ్కో సుముఖం

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆర్‌అండ్‌బీ పరిధిలోని హ్యామ్‌ రోడ్ల పనుల కోసం హడ్కో నుంచి తీసుకోదల్చిన రుణం విషయం ఒక కొలిక్కి వచ్చింది. గతంలో ప్రతిపాదించిన వడ్డీరేటులో కొంత తగ్గించేందుకు హడ్కో సుముఖత వ్యక్తం చేసింది. 8.85 నుంచి 8.9 శాతం వడ్డీ రేటుకు రుణం ఇచ్చేందుకు ప్రాథమికంగా అంగీకరించిందని విశ్వసనీయంగా తెలిసింది.


దీనిపై హడ్కో అధికారికంగా ఒకటి, రెండ్రోజుల్లో ఆర్‌అండ్‌బీ పరిధిలోని రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఆర్‌డీసీ)కు లేఖ రాయనుందని సమాచారం. అయితే వడ్డీరేటును తగ్గించి రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన హడ్కో.. రుణం చెల్లింపుల విషయంలో ఓ షరతును పెట్టనుందని, సకాలంలో పేమెంట్లు చేయకపోతే మొత్తం లోన్‌పై 3 శాతం వరకు పెనాల్టీ విధించేలా నిబంధనను పెట్టనుందని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకరిస్తే హ్యామ్‌ రోడ్ల పనులు ముందుకుసాగుతాయి


ఈ వార్తలు కూడా చదవండి..

సదర్‌ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 06:26 AM