తెలంగాణ డీజీపీ నియామకంపై హైకోర్టు ఏం చెప్పిందంటే..
ABN , Publish Date - May 01 , 2026 | 03:28 PM
తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీ నియామకం అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. సీవీ ఆనంద్‌ను తెలంగాణకు రెగ్యులర్ డీజీపీగా నియమించినట్లు ఉన్నత న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీ నియామకం అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. సీవీ ఆనంద్‌ను తెలంగాణకు రెగ్యులర్ డీజీపీగా నియమించినట్లు న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. పూర్తి స్థాయి డీజీపీ నియామకానికి సంబంధించిన జీవో ప్రతిని కోర్టుకు ఏజీ సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోని పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. జీవో కాపీని పరిశీలించిన ధర్మాసనం.. సానుకూలంగా స్పందించింది.
గత డీజీపీ బి.శివధర్ రెడ్డి తాత్కాలిక నియామకం చట్టబద్ధమా, కాదా? అనే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయంలో శివధర్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. కాగా, డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం సుప్రీంకోర్టు గత మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని ధనగోపాల్ రావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. శివధర్ రెడ్డి నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసు విచారణ హైకోర్టులో నడుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
మెడికల్ సీట్ల పేరిట మోసాలు.. తల్లిదండ్రులారా.. జాగ్రత్త!: సీపీ సజ్జనార్
ఆర్టీసీ కండక్టర్, ఇన్‌స్పెక్టర్ మధ్య టికెట్ వివాదం.. వెలుగులోకి సంచలన విషయాలు..