హయత్‌నగర్‌లో దొంగల బీభత్సం.. రంగనాథ స్వామి ఆలయంలో హుండీల చోరీ
ABN , Publish Date - Apr 19 , 2026 | 09:12 AM
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ప్రశాంతంగా ఉండే ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తూ భక్తులను బెంబేలెత్తిస్తున్నారు.
హయత్‌నగర్, ఏప్రిల్ 19: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ప్రశాంతంగా ఉండే ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తూ భక్తులను బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా, తొర్రూరులోని ప్రసిద్ధ రంగనాథ స్వామి దేవాలయంలో భారీ చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో ఆలయానికి చేరుకున్న గుర్తు తెలియని దుండగులు, దేవాలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గర్భాలయం వద్ద ఉన్న రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు, తలుపులు విరగ్గొట్టి ఉండటం చూసి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఆలయంలో దొంగతనం జరగడం ఇది మూడోసారి కావడంతో స్థానిక భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీల వల్ల భయాందోళనలు నెలకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దుండగులు పదే పదే ఈ ఆలయాన్ని టార్గెట్ చేస్తున్నారని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న హయత్‌నగర్ పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవాలయంలోని, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య
హనుమాన్ జయంతికి పటిష్ట బందోబస్తు
Read Latest Telangana News And Telugu News