Share News

రేవంత్‌కు పిచ్చి బాగా ముదిరింది

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:37 AM

సీఎం రేవంత్‌ రెడ్డికి పిచ్చి బాగా ముదిరిపోయిందని బీఆర్‌ఎస్‌ నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌కు పిచ్చి బాగా ముదిరింది

  • ఎర్రగడ్డలో వేయాలంటే ముందు ఆయననే వేయాలి: హరీశ్‌

హైదరాబాద్‌/ఖైరతాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ రెడ్డికి పిచ్చి బాగా ముదిరిపోయిందని బీఆర్‌ఎస్‌ నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి ఎవరినైనా ఎర్రగడ్డ ఆస్పత్రిలో వేయాల్సి వస్తే ముందుగా రేవంత్‌నే పంపించాల్సి ఉంటుందన్నారు. ‘‘కాంగ్రె్‌సలో కొందరు ఎమ్మెల్యేలకు పిచ్చి కుక్క కరిచినట్లుంది. వాళ్లను కాంగ్రెస్‌ కార్యకర్తలే ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలిస్తారు’’ అంటూ అసమ్మతి నేతలను ఉద్దేశించి రేవంత్‌ శుక్రవారం సిద్దిపేటలో చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఈ విధంగా స్పందించారు.


రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. తెలంగాణ భవన్‌లో ప్రతిరోజు జరుగుతున్న బీఆర్‌ఎ్‌సలో చేరికలే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్‌ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్‌ స్థానిక నేతలు వైల ప్రవీణ్‌, శ్రీనాథ్‌లు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీ‌ష్‌రావు మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ అసెంబ్లీకి నేడో, రేపో ఎన్నికలు రాబోతున్నాయని, ఇక్కడ బీఆర్‌ఎస్సే గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నాయని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌‌స్టర్ అరెస్టు

పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..

Updated Date - Nov 22 , 2026 | 07:37 AM