Share News

పైసలియ్యని పథకాలకు..ఇందిర, రాజీవ్‌ల పేర్లెందుకు?: హరీశ్‌

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:32 AM

ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ పేర్లతో పథకాలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటి అమలుకు మాత్రం పైసలివ్వకుండా మోసం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు.

పైసలియ్యని పథకాలకు..ఇందిర, రాజీవ్‌ల పేర్లెందుకు?: హరీశ్‌
Harish Rao

నిజాంపేట/హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ పేర్లతో పథకాలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటి అమలుకు మాత్రం పైసలివ్వకుండా మోసం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం ఆయన పలువురు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎల్‌నినో ముంచుకొస్తున్నదని చెబుతూ ప్రజలను భయపెడుతున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో విఫలమైందని మండిపడ్డారు.


నెలరోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటివరకు ఒక్క గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కాగా, ‘మేనిఫెస్టోకు మూడేళ్లు.. కాంగ్రెస్‌ నయవంచనకు మూడేళ్లు.. ఇంతకాలం గడిచినా వారి హామీలకు దిక్కులేదు.. అభయ హస్తం.. శూన్యహస్తంగా మారింది’ అని హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా ఆరోపించారు.


ఇవి కూడా చదవండి...

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Read Latest National News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 06:32 AM