Share News

సిద్దిపేట గడ్డ నుంచే మరో ఉద్యమం

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:58 AM

‘‘నాడు తెలంగాణ ఉద్యమానికి, తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్దిపేటనే వేదికైంది. రేపు మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి కూడా ఈ గడ్డ నుంచే ఉద్యమం మొదలవుతుంది’’ అని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు అన్నారు.

సిద్దిపేట గడ్డ నుంచే మరో ఉద్యమం
Harish Rao

  • మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారం

  • ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

  • నీళ్లున్నా పంటలను ఎండబెడుతున్నారు: హరీశ్‌రావు

సిద్దిపేట, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘నాడు తెలంగాణ ఉద్యమానికి, తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్దిపేటనే వేదికైంది. రేపు మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి కూడా ఈ గడ్డ నుంచే ఉద్యమం మొదలవుతుంది’’ అని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం సిద్దిపేటలో దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గోదావరి, కృష్ణా జలాల్లో పుష్కలంగా నీరున్నా పంటలను ఎంబెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. ఇది కాలంతో వచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అని ఆరోపించారు. మళ్లీ పాతరోజులు తెస్తానని అన్నట్లుగానే రేవంత్‌ చేశారన్నారు.


కరెంటు కోతలు, ట్రాన్స్‌ఫార్మర్లు పేలడం, మోటార్లు కాలడం, యూరియా కోసం చెప్పుల వరుసలు, పంటలు ఎండడం అన్నీకూడా పాతరోజులను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. 9నెలల క్రితమే ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిసినా చర్యలు తీసుకోలేదని..తన బావమరిదికి బొగ్గు టెండర్లు కట్టబెట్టేందుకు బొగ్గు ఉత్పత్తి ఆలస్యం చేయడంతో విద్యుత్‌ కోతలు తలెత్తుతున్నాయన్నారు. పదేళ్ల క్రితం కొత్త జిల్లాలు ఏర్పడగా.. సంబరాలు జరిపితే కేసీఆర్‌కు పేరొస్తుందని ప్రభుత్వం తరపున కనీస వేడుకలు చేయలేదని ఆయన విమర్శించారు. కాగా ఈ వేడుకల్లో కేసీఆర్‌ చిత్రపటానికి రంగనాయకసాగర్‌ గోదావరి జలాలతో అభిషేకం చేశారు. తెలంగాణ వచ్చాకనే నలభై ఏళ్ల నినాదాలైన సిద్దిపేట జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు సౌకర్యం సాకారమైందని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీజేపీ రావణుడైతే.. కాంగ్రెస్‌ రాముడు

‘శివ’శివా.. ఏం జరుగుతోంది?

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 04:58 AM