Share News

నా జీవితం తెరిచిన పుస్తకం.. దగ్గరుండి నా భూములన్నీ చూపిస్తా: మాజీ మంత్రి హరీశ్ రావు

ABN , Publish Date - Sep 18 , 2026 | 03:13 PM

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య భూ కబ్జా వివాదం రోజురోజుకీ ముదురుతోంది. భూములను కబ్జా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తన భూములను అధికారులు, కాంగ్రెస్ నేతలు తనిఖీ చేయనున్నారన్న అంశంపై ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.

నా జీవితం తెరిచిన పుస్తకం.. దగ్గరుండి నా భూములన్నీ చూపిస్తా: మాజీ మంత్రి హరీశ్ రావు
hareesh rao react on govt

హైదరాబాద్, సెప్టెంబర్ 18: బీఆర్ఎస్ నేతలు ధరణి పేరుతో భూ కబ్జాలకు పాల్పడ్డారని అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధికారులు తన భూములను తనిఖీ చేయనున్నారన్న అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.


ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం, నేతలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా భూములు చూసేందుకు కాంగ్రెస్ నేతలు వస్తున్నారట.. . డ్రోన్లు పెట్టి ఫొటోలు తీస్తారట.. ఇవన్నీ ఎందుకు.. నేనిక్కడే ఉన్నా.. నాకు చెబితే అన్ని ఏర్పాట్లూ నేనే చేయిస్తా కదా.. దగ్గరుండి నా భూములన్నీ చూపిస్తా.. దాని కోసం వందల మంది పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ బండ్లు ఎందుకు.. నా జీవితం తెరిచిన పుస్తకం.. ఎన్నికల అఫిడవిట్‌లో నా భూములు, ఆస్తుల వివరాలు స్పష్టంగా తెలియజేశా.. మీలా నేను ప్రజల సొమ్ము దోచుకోలేదు.. కబ్జాలు చేయలేదు.. ’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

కేసులకు భయపడం.. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తా: కేటీఆర్

జగన్నాటకంతో ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై మహేశ్వర్ రెడ్డి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 03:16 PM