Share News

కుంటి సాకులు చెప్పకండి భట్టీ..!

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:58 AM

‘‘విద్యుత్‌ సంక్షోభానికి సంబంధం లేని కాగితాలను చూపించి.. రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని చెప్పడం మీకే చెల్లింది భట్టీ... కుంటి సాకులు చెప్పకండి.. అంటూ బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుంటి సాకులు చెప్పకండి భట్టీ..!
Harish Rao

  • ప్రెస్‌మీట్లు పెడితే కరెంట్‌ కష్టాలు తీరవు: హరీశ్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘‘విద్యుత్‌ సంక్షోభానికి సంబంధం లేని కాగితాలను చూపించి.. రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని చెప్పడం మీకే చెల్లింది భట్టీ... కుంటి సాకులు చెప్పకండి.. అంటూ బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వం సక్రమంగా కరెంట్‌ సరఫరా చేస్తే రైతులు సబ్‌ స్టేషన్ల వద్దకు ఎందుకు వస్తారు? రోడ్లపై ధర్నాలెందుకు చేస్తారో చెప్పాలన్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి.. మమ్మల్ని తిడితే కరెంటు కష్టాలు తీరవని, దిద్దుబాటు చర్యలపై దృష్టిపెట్టాలని బుధవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌ వినియోగదారులపై ట్రూఅప్‌ చార్జీల పేరిట రూ.5,420 కోట్ల భారం మోపడం గురించి మేం ప్రశ్నిస్తే.. డిప్యూటీ సీఎం మాట్లాడకుండా వెళ్లిపోవడం ప్రజాపాలన అంటారా? అని ప్రశ్నించారు.


తాను పక్కనే ఉండి... ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తామని అధికారులతో చెప్పించడం సిగ్గుచేటన్నారు. బొగ్గు నిల్వలు పెట్టుకోకుండా.. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి నిలపకపోవడంతో రైతులకు కరెంట్‌ సరఫరా చేయడంలేదని ఆరోపించారు.ఎల్‌నినో సాకు చెబుతూ యాదాద్రిలో 3000, భద్రాద్రిలో 540, కేటీపీఎ్‌సలో 800 మెగావాట్ల చొప్పున విద్యుదుత్పత్తి ఆగిన మాట నిజం కాదా అన్నారు. రాష్ట్రంలో మొత్తంగా 140 మిలియన్‌ యూనిట్ల కెపాసిటీ ఉంటే 89 మిలియన్‌ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు మీరే చెప్పారు కదా.. ఇది మీ వైఫల్యం కాదా అని నిలదీశారు. ట్రూఅప్‌ చార్జీల పేర ప్రజలపై వేస్తున్న భారాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి...
జోరుగా యంగ్‌ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు

చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 05:58 AM