Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీశ్ రావు విచారణ ప్రారంభం
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:00 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీశ్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 20: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Former Minister Hairsh Rao) విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మాజీ మంత్రి.. సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ముందుకు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి హరీశ్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీశ్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఒకే రోజే 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా హరీశ్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఓవైపు సిట్ విచారణ కొనసాగుతున్న సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సిట్ విచారణకు వచ్చిన హరీశ్ రావు వెంట భారీగా బీఆర్‌ఎస్ శ్రేణులు తరలివచ్చారు. అయితే.. హరీశ్ రావు మినహా ఎవ్వరినీ అనుమతించేది లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. స్టేషన్ చుట్టుపక్కల ఎవరూ ఉండొద్దని హెచ్చరించడంతో బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి...
డైవర్షన్ కోసమే నోటీసులు.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్
దారుణం... తల్లిపై కొడుకు కత్తితో దాడి
Read Latest Telangana News And Telugu News