డిండికి నీటి తరలింపుపై వివాదం వద్దు: గుత్తా
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:42 AM
డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలించే పనులపై వివాదం సృష్టించవద్దని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
నల్లగొండ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలించే పనులపై వివాదం సృష్టించవద్దని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కొందరు అధికారులు, ఇంజనీర్లు భావోద్వేగాలను రెచ్చగొట్టేలా పాలమూరు ప్రాంత ప్రజాప్రతినిధులను తప్పుదారి పట్టించడం సరికాదని హితవు పలికారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏదుల రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేస్తున్న 8పంపులకు అదనంగా మరో పంపు అమర్చాలని, అందులో 7పంపుల ద్వారా పాలమూరు ఎత్తిపోతల పథకానికి 1.5 టీఎంసీల నీటిని తీసుకోవాలని అన్నారు. మిగతా 2పంపుల నుంచి డిండి ఎత్తిపోతలకు 0.5 టీఎంసీలు కేటాయించడం ద్వారా వివాదాలకు తావులేకుండా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా కాకుండా, పాలమూరు ప్రజా ప్రతినిధులు తాజాగా ప్రతిపాదిస్తున్న నార్లాపూర్ నుంచి నీటిని తీసుకునే పథకం చేపడితే రూ.15వేల కోట్ల అదనపు వ్యయంతో పాటు, అటవీ, పర్యావరణ అనుమతులు సాధ్యం కావని సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
న్యూయార్క్ కంటే హైదరాబాద్ తక్కువేం కాదు
తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత
ప్రైవేటు వీడియోలు బయటపెడతానని బెదిరించి.. రూ. 6.71 లక్షలు వసూలు
Read Latest AP News And Telangana News And International