Share News

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు

ABN , Publish Date - Apr 30 , 2026 | 10:16 AM

గుజరాత్ పోలీసులు మరోసారి హైదరాబాద్‌లో ఆపరేషన్ చేపట్టారు. చిన్నారులను అక్రమంగా రవాణా చేస్తున్న ఫెర్టిలిటీ సెంటర్లలో గుజరాత్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు
Gujarat Police

హైదరాబాద్, ఏప్రిల్ 30: చిన్నారుల అక్రమ రవాణా కేసులో మురుగన్ గ్యాంగ్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు ఫెర్టిలిటీ సెంటర్లకు మురుగన్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ ఇచ్చిన సమాచారం మూడు ఫెర్టిలిటీ సెంటర్లలో గుజరాత్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆదిలాబాద్‌లో గత ఏడాది వరకు ఇటుకల బట్టిలో పని చేసిన మురుగన్, కేవలం ఒక్క ఏడాదిలోనే చైల్డ్ ట్రాఫికింగ్‌లో కింగ్‌పిన్‌గా ఎదిగాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.


గత ఏడాది చైతన్యపురి కేసులో మురుగన్ పేరు వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మూడు నెలల పాటు జైల్లో ఉన్న అతడు జూలైలో విడుదలయ్యాడు. ఆపై దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. అతడి భార్య కృష్ణవేణి మరో గ్యాంగ్‌ను నడుపుతున్నట్టు గుజరాత్ పోలీసులు గుర్తించారు. ఈ మురుగన్ గ్యాంగ్ ఒక్క ఏడాదిలోనే 25 మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం మురుగన్ గ్యాంగ్ సభ్యులు గుజరాత్ పోలీసుల అదుపులో ఉన్నారు. వారి విచారణలో మురుగన్ గ్యాంగ్‌కు మూడు ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మురుగన్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గుజరాత్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫెర్టిలిటీ సెంటర్ల ప్రమేయానికి సంబంధించి పూర్తి స్థాయిలో గుజరాత్ పోలీసులు విచారణ చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే!

పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకు వెళ్లాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 01:01 PM