Share News

పట్టపగలే ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. నగదు, నగల చోరీ

ABN , Publish Date - May 11 , 2026 | 10:17 AM

హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడ్డ దొంగలు పెద్ద మొత్తంలో బంగారు నగలు, నగదును దోచుకెళ్లారు.

పట్టపగలే ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. నగదు, నగల చోరీ
Hyderabad Robbery

హైదరాబాద్, మే 11: గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడ్డ దొంగలు పెద్ద మొత్తంలో బంగారు నగలు, నగదును దోచుకెళ్లారు. ఇంటి యజమాని మహేశ్ నిన్న(ఆదివారం) ఉదయం లంగర్‌ హౌస్‌లోని తన బంధువుల వివాహానికి కుటుంబసభ్యులతో వెళ్లారు. ఇంటికి తాళం ఉండటాన్ని గమనించిన దొంగలు.. తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు. దాదాపు 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదును దుండగులు అపహరించినట్లు తెలుస్తోంది.


ఉదయం పెళ్లికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన యజమాని.. ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మహేశ్ ఫిర్యాదు మేరకు గోషామహల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిని పరిశీలించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే దుండగులు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.


ఇవి కూడా చదవండి...

బాబు ఇంట మోదీ

సెల్‌ఫోన్ చిచ్చు.. పెళ్లయిన నెల రోజులకే దంపతుల ఆత్మహత్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 11 , 2026 | 10:47 AM