బైక్, కారు ఢీ.. ఐదుగురి మృతి
ABN , Publish Date - May 11 , 2026 | 07:56 AM
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సమీపంలోని బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలకొండ జంక్షన్ వద్ద రేసింగ్ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మహబూబ్‌నగర్, మే 11: జిల్లా కేంద్ర సమీపంలోని బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలకొండ జంక్షన్ వద్ద రేసింగ్ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఒక రేసింగ్ బైక్ అత్యంత వేగంతో వస్తూ.. ఎదురుగా వస్తున్న కారును నేరుగా ఢీకొట్టింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మర్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు సబ్ వేపై ప్రమాదం..
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సబ్ వేపై సోమవారం ఒక కారు ప్రమాదానికి గురైంది. కోకాపేట్ వైపు నుంచి వట్టినాగులపల్లి వైపు వేగంగా వెళ్తున్న కారు.. సబ్ వే సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉండగా.. అందరికీ స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి...
‘సూపర్ 50 నిర్మాణ్’ మోడల్.. కలెక్టర్లే డ్రైవ్ చేయాలన్న సీఎం
భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే
Read Latest Telangana News And Telugu News