Share News

గోల్డ్ మ్యాన్‌ను 12 గంటల పాటు విచారించిన ఐటీ అధికారులు..

ABN , Publish Date - Mar 27 , 2026 | 06:48 PM

తెలంగాణ హాకీ చైర్మన్, హోప్ ఫౌండేషన్ ప్రతినిధి, గోల్డ్‌ మ్యాన్ కొండ విజయ్‌ కుమార్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు గురువారం నాడు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 గంటల పాటు వివిధ కోణాల్లో ఆయనపై ఐటీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు.

గోల్డ్ మ్యాన్‌ను 12 గంటల పాటు విచారించిన ఐటీ అధికారులు..
Konda Vijay Kumar

ఢిల్లీ: తెలంగాణ హాకీ చైర్మన్, హోప్ ఫౌండేషన్ ప్రతినిధి, గోల్డ్‌ మ్యాన్ కొండ విజయ్‌ కుమార్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు నిన్న(గురువారం) అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 గంటలపాటు వివిధ కోణాల్లో ఆయనపై ఐటీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. విజయ్‌ పేరుపై ఉన్న స్థిర, చర ఆస్తులపైనా ఆరా తీశారు. హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన కొండ విజయ్‌‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


హాకీ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా గురువారం నాడు ఢిల్లీకి విజయ్ బయలుదేరారు. అయితే, శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అతన్ని అడ్డుకున్న ఐటీ అధికారులు పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతను ఢిల్లీ వెళ్లగా అక్కడి ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ ఒంటిపై ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టులోనే విచారణ ప్రారంభించారు. దాదాపు 12 గంటల పాటు విచారణ సాగింది. అతని అభ్యర్థన మేరకు అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లేందుకు తాత్కాలిక అనుమతి ఇచ్చారు. పిలిచినప్పుడు మరోసారి విచారణకు రావాలని అతనికి చెప్పినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న జెండా ఆవిష్కరణ

భద్రాద్రి రాముల వారి కల్యాణ మహోత్సవానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..

Updated Date - Mar 27 , 2026 | 07:48 PM