Share News

దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రోకలి బండతో..

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:27 PM

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాతచెరువుకి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొంతకాలం పాటు వారి కాపురం అన్యోన్యంగా సాగింది. వారికి కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే..

దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రోకలి బండతో..
Wife attack on Husband

అనంతపురం: కల్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది ఓ భార్య. ఏకంగా ఇంట్లోనే పూడ్చిపెట్టి పోలీసులకే షాక్ ఇచ్చింది. హత్య గురించి బయట చెప్తే చంపేస్తానంటూ పిల్లలనూ బెదిరించింది. ఎప్పటికైనా విషయం బయటపడుతుందన్న భయంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన జిల్లాలో ఇప్పుడు సంచలనంగా మారింది.


అసలేం జరిగిందంటే..

కల్యాణదుర్గం మండలం పాతచెరువుకి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొంతకాలం పాటు వారి కాపురం అన్యోన్యంగా సాగింది. వారికి కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే, సదరు మహిళకు గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ విషయంపై తరచూ గొడవలు జరిగేవి. తాజాగా వారి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. ఇక భర్తను ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలని ఆమె భావించింది. కఠిన నిర్ణయ తీసుకుంది. అతను నిద్రపోయిన సమయంలో రోకలిబండతో కొట్టి హత్య చేసింది. హత్య చేసిన సమయంలో పిల్లలనూ బెదిరించింది.


విషయం బయటపెడితే ఇదే గతి పడుతుందని భయబ్రాంతులకు గురి చేసింది. అనంతరం ఇంటి ఆవరణలోనే భర్త శవాన్ని పాతిపెట్టింది. అయితే, ఇవాళ(శుక్రవారం) మృతుడి కుమార్తె వేరే గ్రామంలో ఉంటున్న తన నానమ్మ ఇంటికి వెళ్లింది. చిన్నారి తన తండ్రి హత్య విషయాన్ని ఎక్కడ వారితో చెబుతుందో అని భయపడిన సదరు మహిళ వెంటనే కల్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. భర్తను హత్య చేసిన విషయాన్ని చెప్పి లొంగిపోయింది. దీంతో షాక్‌కు గురైన పోలీసులు.. వెంటనే పాతచెరువు గ్రామానికి చేరుకున్నారు. హత్యకు గురైన బాధితుడి మృతదేహాన్ని వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గింపు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన లోకేశ్..

విదేశీ మహిళతో అసభ్య ప్రవర్తన.. మీద చేతులు వేస్తూ..

Updated Date - Mar 27 , 2026 | 05:57 PM