శ్రీరామనవమి రోజు హోమం చేసిన చరణ్.. వీడియో షేర్ చేసిన చిరు..
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:09 PM
శ్రీరామనవమి, రామ్ చరణ్ పుట్టిన రోజులను పురస్కరించుకుని చిరు తన ఇంట్లో హోమం ఏర్పాటు చేశారు. చరణ్‌తో హోమం చేయించారు. చిరంజీవి, సురేఖ దంపతులు దగ్గరుండి హోమం ఏర్పాట్లు చూసుకున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో హోమం జరిగింది. శ్రీరామనవమి, రామ్ చరణ్ పుట్టిన రోజులను పురస్కరించుకుని చిరు తన ఇంట్లో హోమం ఏర్పాటు చేశారు. చరణ్‌తో హోమం చేయించారు. చిరంజీవి, సురేఖ దంపతులు దగ్గరుండి హోమం ఏర్పాట్లు చూసుకున్నారు. చరణ్‌తో హోమం చేయించారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో శుక్రవారం ఓ పోస్టు పెట్టారు.
ఆ పోస్టులో.. ‘శ్రీరామజయం.. ఆ శ్రీరాముని అడుగుజాడల్లో నడిస్తే మనదే విజయం. ఈ ఏడాది శ్రీరామనవమి రోజు యాదృచ్చికంగా చరణ్ బాబు పుట్టినరోజు కలిసి రావడం ఎంతో సంతోషం. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పాటు.. రాముని చరణాల వద్ద తేజోరూపూడై కొలువుండే మా ఇలవేల్పు హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.. జై శ్రీరామ్...!’ అని రాసుకొచ్చారు. చరణ్ హోమం చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు.
గాయంతోటే షూటింగ్‌కు..
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రెండు రోజల క్రితం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా చరణ్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన కంటికి గాయం అయింది. నాలుగు కుట్లు పడ్డాయి. గాయం మానకముందే చరణ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. చరణ్ కంటికి బ్యాండేజీతో షూటింగ్ స్పాట్ దగ్గరకు వచ్చిన దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
అయ్యో పాపం.. వివాహానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు..
దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రోకలి బండతో..