ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన గోదావరి నది యాజమాన్య బోర్డు
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:46 AM
తెలంగాణ చేపట్టిన, అనుమతులు సాధించిన ప్రాజెక్టులపై చర్చించాలనే ఏపీ విజ్ఞప్తులను గోదావరి నది యాజమాన్య బోర్డు తోసిపుచ్చింది.
తెలంగాణ చేపట్టిన, అనుమతులు సాధించిన ప్రాజెక్టులపై చర్చించాలనే ఏపీ విజ్ఞప్తులను గోదావరి నది యాజమాన్య బోర్డు తోసిపుచ్చింది. కేంద్ర జలవనరుల సంఘం క్లియరెన్స్‌లు పొంది సాంకేతిక సలహా మండలి నుంచి క్లియరెన్స్‌లు తీసుకున్న ప్రాజెక్టులపై మళ్లీ చర్చించే అధికారం తమకు లేదంటూ ఏపీ అభ్యంతరాలను పక్కన పెట్టింది.
ఈమేరకు 30న గోదావరి బోర్డు జరగనున్న సమావేశానికి సంబంధించిన అజెండాను పంపించింది. ఇందులో 17వ బోర్డు సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన మినిట్స్‌కు ఆమోదం తెలపడం, బోర్డుకు తెలుగు రాష్ట్రాలు నిధులు కేటాయించాలనే అంశం, ప్రాజెక్టుల నీటి లెక్కలు తీయడానికి టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటు, ఏపీలోని ప్రాజెక్టుల మదింపు పురోగతిపై చర్చించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Read Latest AP News And Telangana News And International