సౌండ్ సిస్టమ్‌లతో వృద్ధులు, రోగులకు ఇబ్బంది
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:51 AM
గణేశ్ నిమజ్జనం సందర్భంగా రాత్రి వేళల్లో రోడ్లపై పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్‌లు మోగించడంతో వృద్ధులు, రోగులకు ఇబ్బంది కలుగుతోందని హైకోర్టు స్పష్టం చేసింది.
గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాలు ఈ ఏడాదీ వర్తిస్తాయి
వాటి అమలుపై నివేదిక సమర్పించాలి: హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): గణేశ్ నిమజ్జనం సందర్భంగా రాత్రి వేళల్లో రోడ్లపై పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్‌లు మోగించడంతో వృద్ధులు, రోగులకు ఇబ్బంది కలుగుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. నిర్వాహకులు ధ్వని కాలుష్య నిబంధనలను పాటించడం లేదని, వాటిపై తక్షణం దృష్టి సారించాలని తెలిపింది. గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై కోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు నిర్మల్ జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
గత ఏడాది గణేశ్ విగ్రహాల ప్రతిష్ఠాపన, డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై జారీ చేసిన మార్గదర్శకాలు ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్తిస్తాయని తేల్చి చెప్పింది. ఈనెల 25న గణేశ్ నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో.. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో మార్గదర్శకాల అమలుపై గురువారంలోపు నివేదిక సమర్పించాలని, నిర్మల్ జిల్లాలో అమలుకు సంబంధించిన వివరాలతో కౌంటర్ అఫిడవిట్ వేరుగా దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బ్రహ్మోస్ సీఈవో జైతీర్థ్ జోషీకి హైకోర్టులో ఊరట
మ్యాట్రిమోనియల్ మోసగాడిపై పీడీ యాక్ట్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News