మ్యాట్రిమోనియల్ మోసగాడిపై పీడీ యాక్ట్
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:40 AM
ఎన్‌ఆర్‌ఐ అని పేర్కొంటూ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా యువతులకు గాలం వేసి అందినకాడికి దోచుకున్న వ్యక్తిపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు.
చర్లపల్లి జైలుకి ఏపీకి చెందిన కామేశ్ అలియాస్ కార్తీక్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఆర్‌ఐ అని పేర్కొంటూ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా యువతులకు గాలం వేసి అందినకాడికి దోచుకున్న వ్యక్తిపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2021 నుంచి నమోదైన 19 మోసం కేసుల్లో ప్రమేయం ఉన్న మండా వెంకట కామేశ్ అలియాస్ కార్తీక్ రెడ్డి (33)ని ప్రివెంటివ్ డిటెన్షన్(పీడీ) చట్టం కింద అదుపులోకి తీసుకుని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా మోర్త గ్రామానికి చెందిన కామేశు బీటెక్ చదివాడు.
సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో కార్తీక్ రెడ్డి నకిలీ ప్రొఫైల్స్ సృష్టించా డు. వివాహం చేసుకుంటానని యువతులకు గాలం వేసేవాడు. ఆపై, సోదరి విద్యా ఖర్చులు, బ్యాంకు సమస్యలు, లావాదేవీల పరిమితులు వంటి కారణాలు చెప్పి ఆ యువతుల నుంచి డబ్బు తీసుకునేవాడు. 2021 నుంచి ఇప్పటి వరకు నమోదైన 19 మోసం కేసుల్లో కామేశ్ ప్రమేయం ఉండగా.. సైబర్ క్రైం పోలీసులు అతడిని ఇప్పటికే పలుమార్లు జైలుకు తరలించారు. కామేశ్ మరిన్ని మోసాలకు పాల్పడకుండా నిరోధించే ఉద్దేశంతో పీడీ యాక్ట్ కింద నిర్బంధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు
ఐదు డీఏలు ఇవ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News