Share News

బ్రహ్మోస్‌ సీఈవో జైతీర్థ్‌ జోషీకి హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Sep 23 , 2026 | 07:45 AM

బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ డైరెక్టర్‌ జనరల్‌- సీఈవో జైతీర్థ్‌ ఆర్‌ జోషీకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను ఆ పదవిలో నుంచి తొలగించాలంటూ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) హైదరాబాద్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.

బ్రహ్మోస్‌ సీఈవో జైతీర్థ్‌ జోషీకి హైకోర్టులో ఊరట
Telangana High Court

  • ఆయనను తొలగించాలన్న క్యాట్‌ ఉత్తర్వుల కొట్టివేత

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ డైరెక్టర్‌ జనరల్‌- సీఈవో జైతీర్థ్‌ ఆర్‌ జోషీకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను ఆ పదవిలో నుంచి తొలగించాలంటూ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) హైదరాబాద్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్‌ శ్యాంకోషీ, జస్టిస్‌ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అత్యంత సీనియర్‌ శాస్త్రవేత్తను అయిన తనను కాదని సీఈఓ పదవిలో జైతీర్థ్‌ జోషిని నియమించడాన్ని సవాల్‌ చేస్తూ శివసుబ్రమణియం నంబి నాయుడు 2025 నవంబర్‌లో క్యాట్‌ను ఆశ్రయించారు.


విచారణ జరిపిన ట్రైబ్యునల్‌ జైతీర్థ్‌ను తొలగించి, నంబి నాయుడును నియమించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై జైతీర్థ్‌ జోషితోపాటు రక్షణమంత్రిత్వశాఖ, డీఆర్‌డీవో ఈ ఏడాది జనవరి 5న వేర్వేరుగా హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ధర్మాసనం విస్తృతంగా విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నర్సింహ శర్మ వాదిస్తూ ఇది కేవలం సీనియార్టీకి సంబంధించిన అంశం కాదని, దీర్ఘకాలిక జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఎంపిక అని తెలిపారు. భారత్‌, రష్యా దేశాల వ్యూహాత్మక సంయుక్త ప్రాజెక్టు అయిన బ్రహ్మోస్‌ మిసైల్‌ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనను నియమించారని పేర్కొన్నారు. దీనితో ఏకీభవించిన ధర్మాసనం.. క్యాట్‌ తీర్పును కొట్టివేస్తూ జైతీర్థ్‌ నియామకాన్ని సమర్థించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు
మ్యాట్రిమోనియల్‌ మోసగాడిపై పీడీ యాక్ట్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 07:45 AM