Share News

గాంధీ ఆస్పత్రి చిన్న పిల్లల వార్డులో.. వెంటిలేటర్‌ కావాలంటే క్యూ కట్టాల్సిందే!

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:59 AM

గాంధీ ఆస్పత్రి చిన్నపిల్లల వార్డులో వెంటిలేటర్లు పాడయి రెండేళ్ల నుంచి తుప్పు పడుతున్నా గాంధీ పాలనా అధికారులు పట్టించుకోవడం లేదు.

గాంధీ ఆస్పత్రి చిన్న పిల్లల వార్డులో..  వెంటిలేటర్‌ కావాలంటే క్యూ కట్టాల్సిందే!
Gandhi Hospital ventilator shortage

  • ఏళ్లు గడుస్తున్నా మరమ్మతుకు దిక్కు లేదు!

అడ్డగుట్ట, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గాంధీ ఆస్పత్రి చిన్నపిల్లల వార్డులో వెంటిలేటర్లు పాడయి రెండేళ్ల నుంచి తుప్పు పడుతున్నా గాంధీ పాలనా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశువులతో పాటు ఏడేళ్లలోపు పిల్లలకు అత్యవసర సమయంలో వెంటిలేటర్‌ కావాలంటే క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఒకరి తరువాత ఒకరికి క్యూలో శిశువులకు ఈ సౌకర్యం అందిస్తున్నారు. ఉన్నవాటిలో కొన్ని మాత్రమే పనిచేయడం ఇందుకు కారణం. అయినా వాటిని మరమ్మతు చేయించడానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.


మరమ్మతు చేయిస్తాం

కరోనా సమయంలో దాతలు ఉచితంగా ఇచ్చిన వెంటిలేటర్లు కొన్ని పనిచేయడం లేదు. వాటికి మరమ్మతు చేయించేందుకు వైద్యుల కమిటీ సమావేశంలో చర్చించాం. ఇంకా ఇలాంటి వైద్య యంత్రాలు వంద వరకు ఉన్నాయి. ఒక్కోటి మరమ్మతు చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమైన వార్డులో వెంటిలేటర్లు పనిచేస్తున్నాయి. పాడైపోయినవి ఎన్ని ఉన్నాయో గుర్తిస్తున్నాం.

- డాక్టర్‌ ఉషారాణి,
సూపరింటెండెంట్‌, గాంధీ ఆస్పత్రి


ఈ వార్తలు కూడా చదవండి..
సిద్దిపేటలో పేకాట మాజీ ఎమ్మెల్సీ సహా నలుగురి అరెస్టు

డోర్‌ డెలివరీ@‘మీ-సేవ’

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 07:00 AM