గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో వ్యక్తి దారుణ హత్య
ABN , Publish Date - Sep 11 , 2026 | 07:51 AM
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. హరిహర మెన్ హాస్టల్‌లో పని చేసే శశిధర్‌ను తోటి పనివాడు ప్రమోద్ శుక్రవారం అర్ధరాత్రి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11: నగరంలోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. హరిహర మెన్ హాస్టల్‌లో పని చేసే శశిధర్‌ను తోటి పనివాడు ప్రమోద్ శుక్రవారం అర్ధరాత్రి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. స్థానికులు వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రమోద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా హరిహర మెన్ హాస్టల్ యాజమానితోపాటు అందులో ఉంటున్న వారిని రాయదుర్గం పోలీసులు విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యుద్ధరంగంలో ‘బీజన్’ టెక్నాలజీ ’
వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూత
For More TG News And Telugu News