వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూత
ABN , Publish Date - Sep 11 , 2026 | 07:08 AM
దేశవ్యాప్తంగా బ్యాంకులు శుక్రవారం నుంచి వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. శుక్రవారం బ్యాంక్ ఉద్యోగులు అఖిల భారత సమ్మె చేపట్టారు.
నేడు ఉద్యోగుల సమ్మె.. మూడు రోజులు సెలవులు
అమరావతి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బ్యాంకులు శుక్రవారం నుంచి వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. శుక్రవారం బ్యాంక్ ఉద్యోగులు అఖిల భారత సమ్మె చేపట్టారు. మరుసటి రోజు రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా, సోమవారం వినాయక చవితి పండుగ సెలవు. దీంతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయని పరిస్థితి. యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం సమ్మెకు దిగుతున్నాయి. వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని, పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని, పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాల పథకాన్ని ఉపసంహరించుకోవాలని, ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ పథకాన్ని సవరించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సర్‌పై ముగిసిన క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ
డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News