Share News

సర్‌పై ముగిసిన క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ

ABN , Publish Date - Sep 11 , 2026 | 03:17 AM

కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ-2026 (సర్‌) ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లైయిములు, అభ్యంతరాల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది.

సర్‌పై ముగిసిన క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ
SIR

  • కొత్త ఓటు నమోదుకు 3,77,908 దరఖాస్తులు

  • తొలగింపునకు 57,019, మార్పులు చేర్పుల కోసం 2,25,370

  • అక్టోబరు 5 వరకు కొనసాగనున్న పరిష్కార ప్రక్రియ...

  • 9న తుది జాబితా విడుదల

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ-2026 (సర్‌) ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లైయిములు, అభ్యంతరాల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. వీటి పరిష్కార ప్రక్రియ అక్టోబరు 5 వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో సర్‌ ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జూలై 31న ప్రచురించింది. గురువారం సాయంత్రం నాటికి.. కొత్త ఓటరు నమోదుకు 3,77,908 దరఖాస్తులు వచ్చాయి.


వీటిలో 1,38,929 దరఖాస్తులను పరిష్కరించారు. ముసాయిదా జాబితా ప్రచురణకు ముందు 87,286 దరఖాస్తులు అందగా... వాటితో కలిపి మొత్తంగా 2,52,012 దరఖాస్తులను పరిష్కరించాలి. ముసాయిదా జాబితా విడుదల తర్వాత ఫారం-7 (మరణించిన, బదిలీ అయిన లేదా అనర్హుల పేర్ల తొలగింపునకు) దరఖాస్తులు 57,019 రాగా, 47,84 దరఖాస్తులను పరిష్కరించారు. ఇంకా 5888 పరిష్కరించాల్సి ఉంది. ముసాయిదా ప్రచురణకు ముందు వచ్చిన మరో 3,499 కలిపి మొత్తంగా పరిష్కరించాల్సినవి 9387. ఫారం-8 దరఖాస్తులు(వివరాల సవరణ, నివాస మార్పు, ఎపిక్‌ రీప్లే్‌సమెంట్‌, దివ్యాంగ ఓటరు నమోదు) మొత్తం 2,25,370 దరఖాస్తులు వచ్చాయి. వాటి లో 78,142 దరఖాస్తులను పరిష్కరించగా 98,694 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. ముసాయిదా ప్రచురణకన్నా ముందు వచ్చిన ఫారం-8 దరఖాస్తులు 51,246తో కలిపి 1,49,940 పరిష్కరించాల్సి ఉంది. వీటన్నింటినీ అక్టోబరు 5లోపు ఎన్నికల అధికారులు పరిష్కరించాలి. అక్టోబరు 9న ఈసీఐ తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తుంది.


44.28 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. సర్‌-2026లో వివిధ కారణాలతో మొత్తం 44.28 లక్షల మంది ఓటర్లకు నోటీసులు పంపినట్లు ఈసీ అధికారులు తెలిపారు. వారిలో 40,36,463 మంది విచారణ పూర్తయింది. సరైన పత్రాలు సమర్పించని 55,400 మందిని అనర్హులుగా తేల్చారు. మిగిలిన 35,53,237 మందిని తుది ఓటర్ల జాబితాలో కొనసాగించేందుకు నిర్ణయించారు. నోటీసులు అందుకున్న మరో 3,92,365 మందిని ఇంకా విచారించాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..
మునిసిపోల్‌కు సమాయత్తం

ఫ్రీహోల్డ్‌కు లైన్‌క్లియర్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 03:17 AM