Share News

యుద్ధరంగంలో ‘బీజన్‌’ టెక్నాలజీ ’

ABN , Publish Date - Sep 11 , 2026 | 06:38 AM

బిట్స్‌పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ విద్యార్థులు.. దేశ రక్షణ రంగానికి వినూత్న సాంకేతికతలను అందిస్తున్నారు. నమన్‌ కస్లీవాల్‌, శివ్‌పాటిల్‌ అనే విద్యార్థులు స్థాపించిన ‘బీజన్‌ టెక్‌’ స్టార్టప్‌.. భారతసైన్యం కోసం అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది.

యుద్ధరంగంలో ‘బీజన్‌’ టెక్నాలజీ ’
STUDENTS

  • వినూత్న రక్షణ సాంకేతికతలను

  • అభివృద్ధి చేస్తున్న బిట్స్‌ విద్యార్థులు

  • తక్కువ వ్యయంతో దృశ్య ఆధారిత నావిగేషన్‌

  • జీపీఎస్‌ లేకున్నా పని చేసే డ్రోన్లు

  • ఫిరంగులను వేగంగా తరలించే వ్యవస్థ

బిట్స్‌పిలానీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): బిట్స్‌పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ విద్యార్థులు.. దేశ రక్షణ రంగానికి వినూత్న సాంకేతికతలను అందిస్తున్నారు. నమన్‌ కస్లీవాల్‌, శివ్‌పాటిల్‌ అనే విద్యార్థులు స్థాపించిన ‘బీజన్‌ టెక్‌’ స్టార్టప్‌.. భారతసైన్యం కోసం అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. బిట్స్‌ హైదరాబాద్‌లోని కోరాస్‌ ల్యాబ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. డ్రోన్లు, ఫిరంగులు మొదలైనవాటిని ఏఐ, రోబోటిక్స్‌, కంప్యూటర్‌ విజన్‌ సాంకేతికతలతో మరింత సమర్థవంతంగా మార్చే టెక్నాలజీలను రూపొందిస్తోంది. ‘బీజన్‌ అటానమస్‌ నావిగేషన్‌ మాడ్యూల్‌’తో జీపీఎస్‌ అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ పని చేయగల డ్రోన్లను నమన్‌ కస్లీవాల్‌, శివ్‌పాటిల్‌ రూపొందించారు. జీపీఎస్‌ జామిం గ్‌ను తట్టుకునేలా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతపై పోఖ్రాన్‌, సికింద్రాబాద్‌, లేహ్‌ తదితర ప్రాంతా ల్లో ప్రయోగాలు కొనసాగుతున్నా యి. ఫిరంగులను వేగంగా తరలించేందుకు ఉపయోగపడే ‘అటానమస్‌ ఆర్టిలరీ పొజిషనింగ్‌ సిస్టమ్‌‘ను ఈ విద్యార్థి ద్వయం తయారు చేసింది. దీనిని ఒక యూనిట్‌లో అమలు చేయటం కోసం రూ.20 లక్షల ఆర్డర్‌ వచ్చింది. ఇస్రో రోబోటిక్స్‌ చాలెంజ్‌లో తక్కువ వ్యయంతో దృశ్య ఆధారిత నావిగేషన్‌ వ్యవస్థను రూపొందించిన నమన్‌ కస్లీవాల్‌, శివ్‌పాటిల్‌ బృందం ఫైన ల్స్‌కు చేరింది. ఈ నావిగేషన్‌ మాడ్యూల్‌ కోసం 8 సైనిక విభాగాల నుంచి ఆసక్తి వ్యక్తమైంది. కాగా, పోఖ్రాన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఆర్మీ డిజైన్‌ బ్యూరో కోసం డ్రోన్‌ స్వార్మ్‌ గ్రౌండ్‌ స్టేషన్‌నూ వీరు అభివృద్ధి చేశారు. ‘క్యూరియాసిటీ-2025’లో విజేతగా నిలిచిన ‘బీజన్‌ టెక్‌’ సంస్థకు పరిశోధన, ఉత్పత్తి అభివృద్ధి కోసం రూ.25 లక్షల గ్రాంట్‌ లభించింది.

Updated Date - Sep 11 , 2026 | 06:40 AM