Share News

పాతబస్తీ మదన్నపేటలో దారుణం.. కుమార్తెను వేధించొద్దన్నందుకు తండ్రి హత్య

ABN , Publish Date - Sep 17 , 2026 | 08:57 PM

పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. తన కుమార్తెను వేధించొద్దు అని హెచ్చరించినందుకు తండ్రి హత్యకు గురయ్యాడు. అడ్డుకోబోయిన సోదరుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..

పాతబస్తీ మదన్నపేటలో దారుణం.. కుమార్తెను వేధించొద్దన్నందుకు తండ్రి హత్య
man attacked a father in pathabasthi

హైదరాబాద్, సెప్టెంబర్ 17: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. తన కుమార్తెను వేధించొద్దు అని హెచ్చరించినందుకు తండ్రి హత్యకు గురయ్యాడు. అడ్డుకోబోయిన సోదరుడికి తీవ్రగాయాలయ్యాయి.


పోలీసుల కథనం మేరకు.. పాతబస్తీలోని మదన్నపేటలో హస్మత్(55) అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నారు. అయితే, ఆయన పక్కింట్లో ఉండే మొహ్మద్ అనే యువకుడు.. హస్మత్ కుమార్తెను వేధిస్తున్నాడు. దీంతో తన కూతురు జోలికి రావొద్దని మొహ్మద్‌ను ఆమె తండ్రి మందలించారు.


దీంతో కక్ష పెట్టుకున్న యువకుడు.. హస్మత్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తిపోట్లకు గురైన హస్మత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకోబోయిన హస్మత్ కుమారుడు ఉమర్‌పై కూడా మొహ్మద్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఉమర్ తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ సహకారంతో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

2029 ప్రధాని అభ్యర్థి రేసు: రాహుల్ గాంధీ వర్సెస్ సీఎం విజయ్?

76 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా, ఆరోగ్యంగా మోదీ.. ప్రధాని డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Updated Date - Sep 17 , 2026 | 09:02 PM