Share News

‘గణపతి జనజీవన స్రవంతిలోకి రండి.. నేనూ మీతో పనిచేస్తా’: గోనె ప్రకాశ్ రావు

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:53 PM

మావోయిస్టు నేత గణపతి బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు పిలుపునిచ్చారు. గణపతి ఆరోగ్యం అంతగా బాగాలేదని అన్నారు.

‘గణపతి జనజీవన స్రవంతిలోకి రండి.. నేనూ మీతో పనిచేస్తా’: గోనె ప్రకాశ్ రావు
Gone Prakash Rao

న్యూఢిల్లీ, మార్చి 6: మావోయిస్టు నేత గణపతి(ముప్పాళ్ల లక్ష్మణరావు) లొంగిపోయారని వార్తలు వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గణపతి జనజీవన స్రవంతిలోకి రావాలని, తుపాకీ వదిలేసి ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. గణపతి కుమారుడు ముప్పాళ్ల శ్రీనివాస్ (వాసు) వాయిస్ మెసేజ్‌ను అనుమతి లేకుండా మీడియాకు షేర్ చేశానని.. దానికి మీడియా ముఖంగా క్షమాపణలు కోరుతున్నానని గోనె ప్రకాష్ రావు తెలిపారు.


గణపతి ఆరోగ్యం అంతగా బాగాలేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. గద్దర్ కూడా తుపాకీ వదిలి రాజ్యాంగ బద్ధంగా న్యాయం జరుగుతుందని నమ్మారని.. అలాగే గణపతి కూడా బయటకు వచ్చి సమాజానికి సేవ చేయాలని సూచించారు. తాను కూడా గణపతితో కలిసి పనిచేస్తానని గోనె ప్రకాశ్ రావు పేర్కొన్నారు. మావోయిస్టు నేత దేవ్‌జీ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని.. ఆయన కోరుట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. దేవ్‌‌జీ, మల్లా రాజిరెడ్డిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలనుకుంటే చేయవచ్చని.. కానీ అలా చేయకుండా సమాజంలోకి తీసుకొచ్చారని చెప్పారు.


సీతక్క.. దళం నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. నక్సల్స్ అంతం అనేది ఉండదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31లోపు మావోయిస్టులకు డెడ్‌లైన్ పెట్టిందని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా నక్సలైట్లు ఉంటే ఎన్‌కౌంటర్ చేయకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సూచించారు.


ఇవి కూడా చదవండి..

బొత్స ఆరోగ్యంగా హౌస్‌కు రావడం సంతోషకరం: మంత్రి లోకేశ్

హృదయపూర్వక అభినంద‌న‌లు చిట్టిత‌ల్లులు: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 12:57 PM