ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Sep 07 , 2026 | 07:13 AM
ఉద్యోగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, వారి ఆరోగ్య భద్రత, హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
ఈహెచ్‌ఎస్ అమలులో రాజీపడబోం
ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోని బీఆర్‌ఎస్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, వారి ఆరోగ్య భద్రత, హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్లు గానీ అనారోగ్యానికి గురైనప్పుడు ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురికాకూడదన్న ఉన్నతమైన ఆశయంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.పథకం అమలులో రాజీపడేదే లేదని చెప్పారు. ఈహెచ్‌ఎ్‌సలో ఇప్పటికే 354 ప్రైవేట్ ఆస్పత్రులుండగా, మరికొన్నింటిని డీమ్డ్ ఎంప్యానెల్డ్ విధానంలో చేర్చినట్లు తెలిపారు. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి, పథకం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమీక్షలో సీఎస్ సంజయ్ జాజు, జేఏడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరి మహేశ్ దత్ ఎక్కా, హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా, ఈహెచ్‌ఎ్‌స సీఇవో హనుమంతు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచం మెచ్చేలా.. గోదావరి పుష్కరాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News