Share News

ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్.. డ్రగ్స్ డాన్ నీతూబాయి పరారీ

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:24 PM

హైదరాబాద్ ఐటీ కోర్ ఏరియాలో డ్రగ్స్ అక్రమ దందాపై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. నానక్‌రాంగూడలో డ్రగ్స్ డాన్ నీతూబాయిని పట్టుకునేందుకు ఈగల్‌ ఫోర్స్‌ ఆపరేషన్ నిర్వహించింది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో డ్రగ్స్ డాన్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.

ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్.. డ్రగ్స్ డాన్ నీతూబాయి పరారీ
Eagle Force Operation

హైదరాబాద్, జూన్ 10: హైదరాబాద్ ఐటీ కోర్ ఏరియాలో డ్రగ్స్ అక్రమ దందాపై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. నానక్‌రాంగూడలో డ్రగ్స్ డాన్ నీతూబాయిని పట్టుకునేందుకు ఈగల్‌ ఫోర్స్‌ ఆపరేషన్ నిర్వహించింది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో డ్రగ్స్ డాన్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, నీతూబాయి కోసం నానక్‌రాంగూడలోనే ఈగల్ ఫోర్స్ మకాం వేసింది. ఐటీ కోర్ ఏరియాలో నీతూబాయి పెద్దఎత్తున గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు బయటపడింది. నీతూబాయి ఇంటికి గంజాయి కొనుగోలు చేసేందుకు ఐటీ ఎంప్లాయిస్ క్యూ కట్టారు. గంట వ్యవధిలోనే 50 మంది ఐటీ ఉద్యోగులను ఈగల్ ఫోర్స్ పట్టుకుంది.


ధూల్‌పేట్ నుంచి వచ్చి ఐటీ కోర్ ఏరియాలో అడ్డాపెట్టిన నీతూబాయి.. కిరాణా షాపు మాటున గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతిరోజు ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు గంజాయి అమ్మకాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. గతంలోనే నీతూబాయిని అరెస్ట్ చేసిన అధికారులు.. పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన నీతూ.. మళ్లీ గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రగ్స్ డాన్‌ను పట్టుకునేందుకు ఈగల్ ఫోర్స్‌గా తీవ్రంగా శ్రమిస్తోంది.


ఇవి కూడా చదవండి...

భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం.. చరిత్రలో నిలిచే రోజు: సీఎం రేవంత్

పీసా చట్టం.. ఆదివాసీల నిర్ణయాధికారానికి రక్షణ కవచం: మంత్రి సీతక్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 04:44 PM