రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా డీఎస్ చౌహాన్
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:29 AM
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్‌ను ప్రభుత్వం నియమించింది.
వ్యక్తిగత సెలవులో వెళ్లిన నాగిరెడ్డి
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్‌ను ప్రభుత్వం నియమించింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా వై.నాగిరెడ్డికి ప్రభుత్వం ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడంతో ఆయన విధుల్లో చేరారు.
ఆ తర్వాత ఈనెల 27 నుంచి వ్యక్తిగత సెలవులో వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో డీఎస్ చౌహాన్ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా నియమితులయ్యారు. కాగా డీఎస్ చౌహాన్ గతంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు. డిసెంబరు 8వ తేదీ వరకు నాగిరెడ్డి సెలవులో ఉండగా... ఆయన విధుల్లో చేరగానే చౌహాన్ ఇక్కడి నుంచి రిలీవ్ అవుతారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!