రెండేళ్లలో పూర్తయ్యేనా..!?
ABN , Publish Date - Nov 30 , 2026 | 03:47 AM
డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో నెగ్గించుకొనేందుకు తీవ్రంగా కష్టపడుతున్న కేంద్ర ప్రభు త్వం.. ఆ బిల్లు చట్టంగా మారిన తర్వాత గడువులోగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయటానికి మరింత కష్టపడాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
2029 నాటికి డీలిమిటేషన్ సవాలే..!..
సీట్లు పెంచకున్నా గత డీలిమిటేషన్‌కు పట్టిన కాలం ఐదున్నరేళ్లు
ప్రస్తుతం సీట్ల పెంపుతోపాటు మహిళా రిజర్వేషన్ అమలు కూడా..
2029 ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు!
అప్పటిలోగా డీలిమిటేషన్ పూర్తిచేయాలని భావిస్తున్న ప్రభుత్వం
హైదరాబాద్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో నెగ్గించుకొనేందుకు తీవ్రంగా కష్టపడుతున్న కేంద్ర ప్రభు త్వం.. ఆ బిల్లు చట్టంగా మారిన తర్వాత గడువులోగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయటానికి మరింత కష్టపడాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఈసారి లోక్‌సభ, రాష్ట్రాల శాస నసభల స్థానాల పెంపుతోపాటు వాటిల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల నిర్ధారణ కూడా చేపట్టాల్సి ఉంటుంది. అందుకు చాలా సమ యం పట్టవచ్చని చెబుతున్నారు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. అంటే ఈ ప్రక్రియను పూర్తిచేయటానికి గరిష్ఠంగా రెండేళ్ల సమయమే ఉంటుంది. గతంలో చేపట్టిన డీలిమిటేషన్‌కు దాదాపు ఐదున్నరేళ్ల సమయం పట్టింది. అప్పుడు నియోజకవర్గాల సంఖ్యను కూడా పెంచలేదు. ఇప్పుడు సీట్ల సంఖ్యను పెంచుతూ పునర్విభజన చేయాల్సి ఉంటుంది.
వాస్తవానికి గత డీలిమిటేషన్ ప్రక్రియను కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వమే ప్రారంభించింది. నాటి వాజ్‌పేయి ప్రభుత్వం డీలిమిటేషన్ కోసం 2002 జూలై 12న జస్టిస్ కుల్‌దీప్‌సింగ్ చైర్మన్‌గా కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌కుకాలపరిమితి రెండేళ్లు మాత్రమే విధించినా.. నిర్దేశిత సమయంలో ప్రక్రియ పూర్తి కాకపోవడంతో కాలపరిమితిని పొడిగిస్తూ వెళ్లారు. చివరికి 2008 ఫిబ్రవరి 19న కమిషన్ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. వాజ్‌పేయి ప్రభుత్వంలో కమిషన్ ఏర్పాటైతే.. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.
ప్రస్తుత మోదీ ప్రభుత్వ కాలపరిమితి 2029 జూన్‌లో ముగుస్తుంది. అంటే లోక్‌సభకు 2029 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పునర్విభజన తర్వా త కొత్తగా ఏర్పాటయ్యేనియోజకవర్గాల ప్రకారం ఓటరు జాబితాలను మార్చడానికి ఎన్నికల కమిషన్‌కు కొన్నినెలల సమయం పడుతుంది. మరోవైపు కేంద్రప్రభుత్వం తాజాగా అనుకుంటున్న విధానంలో డీలిమిటేషన్ చేపట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇందుకోసం మెజారిటీ అసెంబ్లీల ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తి కావటానికి కనీసం నెల రోజులైనా పట్టే అవకాశం ఉంది. 2027 జనవరిలో డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తే ప్రక్రియను పూర్తి చేయడానికి గరిష్ఠంగా రెండేళ్ల సమయం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆధునిక సాంకేతికత వాడినా కష్టమే!
గత డీలిమిటేషన్ సమయంలో ఉన్న టెక్నాలజీతో పోల్చితే ప్రస్తుతం కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చా యి. ఈ పరిజ్ఞానంతో డిజిటల్ మ్యాపింగ్, అభ్యంతరాల వర్గీకరణ వంటి క్లరికల్ పనులు వేగంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనను 2011 జనాభా లెక్కల ఆధారంగానే చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కలు ఇప్పటికే అందుబాటులో ఉన్నందున ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి తక్కువ సమయంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులు నిర్ణయించేందుకు ఆస్కారం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. డిజిటల్ మ్యాపులు, ఏఐ టూల్స్‌తో పనిలో వేగం పెరిగి.. గ్రామ, వార్డు స్థాయి జనాభా డేటా కూర్పు, ప్రత్యామ్నాయ ముసాయిదా మ్యాపుల రూపకల్పన, అభ్యంతరాల వర్గీకరణ త్వరగానే పూర్తవుతుందని చెబుతున్నారు.
అయితే, ము సాయిదా ప్రతిపాదనలను గెజిట్‌లో ప్రచురించడం, అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చే గడువు, నియోజకవర్గాల వారీగా సమావేశాల నిర్వహణ వంటి చట్టపరమైన ప్రక్రియలకు పట్టే సమయాన్ని కుదించేందుకు ఆస్కారం లేదంటున్నారు. పైగా నియోజకవర్గాల పెంపునకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు వంటి అదనపు పనులు ఉన్నందున పని భారం పెరగనుందని గుర్తు చేస్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను కోర్టుల్లో సవాల్ చేసే వీలు లేకుండా బిల్లును రూపొందించినట్లు సమాచారం. అలా అయితే కమిషన్‌కు మరికొంత సమయం ఆదా అవుతుంది. కానీ, బిల్లులోని అంశాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తవుతుందా లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!