Share News

మహిళా జర్నలిస్టుల పట్ల ఢిల్లీ పోలీసుల తీరును ఖండిస్తున్నాం

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:44 AM

ముగ్గురు మహిళా జర్నలిస్టుల పట్ల ఢిల్లీ పోలీసులు అనుసరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఫోరం ఫర్‌ కానిస్టిట్యూషనల్‌ డెమోక్రసీ (ఎఫ్‌సీడీ) పేర్కొంది.

మహిళా జర్నలిస్టుల పట్ల ఢిల్లీ పోలీసుల తీరును ఖండిస్తున్నాం
women journalists

  • ఫోరం ఫర్‌ కానిస్టిట్యూషనల్‌ డెమోక్రసీ

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ముగ్గురు మహిళా జర్నలిస్టుల పట్ల ఢిల్లీ పోలీసులు అనుసరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఫోరం ఫర్‌ కానిస్టిట్యూషనల్‌ డెమోక్రసీ (ఎఫ్‌సీడీ) పేర్కొంది. ఈ మేరకు ఎఫ్‌సీడీ కన్వీనర్‌ కె.రామచంద్రమూర్తి, సభ్యులు జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్‌లు జి.హరగోపాల్‌, శాంతాసిన్హా, రమామెల్కోటే, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది జి.జ్యోతికిరణ్‌ సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.


మహిళలను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ వివేక్‌ భగత్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ఢిల్లీ పోలీసులు నిరాకరించడం విచారకరమన్నారు. ముగ్గురు జర్నలిస్టుల్లో ఇద్దరు గతంలో కూడా సదరు ఏసీపీపై ఫిర్యాదు చేసినా.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు స్పందించి సదరు ఏసీపీని సస్పెండ్‌ చేసి, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి...
‘మహాలక్ష్మి’కి మస్త్‌ డిమాండ్‌!

ఇద్దరు గిరిజన బాలికల ఆత్మహత్యాయత్నం
స్పాన్సర్‌షిప్‌లతో గ్లోబల్‌ సమ్మిట్‌.!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 06:44 AM