తెలంగాణ భవన్‌లో దీక్షాదివస్
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:50 AM
తెలంగాణ భవన్‌లో ‘దీక్షా దివస్’ సందర్భంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
కేసీఆర్ దీక్షతోపాటు పదేళ్ల పాలనపై డాక్యుమెంటరీ
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భవన్‌లో ‘దీక్షా దివస్’ సందర్భంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, నవీన్ కుమార్ రెడ్డి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2009 నవంబరు 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష ప్రాధాన్యంతోపాటు పదేళ్ల పాలనలో జరిగిన పలు సంఘటనలతో కూడిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. తొలుత తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. జై తెలంగాణ.. లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ పార్టీ నేతలు నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి దుష్ట పాలనను అంతమొందించడానికి దీక్షా దివ్‌సను స్ఫూర్తిగా తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!