Share News

ఖైరతాబాద్‌ గణేశుడికి ఉన్నంత పేరు నాకొచ్చింది

ABN , Publish Date - Sep 20 , 2026 | 03:31 AM

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఖైరతాబాద్ ప్రజలు తనతోనే ఉన్నారని, ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్తేమీ కాదని ఆయన అన్నారు.

ఖైరతాబాద్‌ గణేశుడికి ఉన్నంత పేరు నాకొచ్చింది
Danam Nagender

  • హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్‌ ఉప ఎన్నికకు సిద్ధమని వెల్లడి

ఖైరతాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్‌ గణేశుడికి దేశ వ్యాప్తంగా ఎంత పేరుందో.. హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత తనకు అంత పేరొచ్చిందని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. హైదరాబాద్‌, ఖైరతాబాద్‌లో వినాయకుడిని దర్శించుకునేందుకు శనివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు దానం నాగేందర్‌ స్వయంగా ప్రసాదాలు పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే తనకు చాలా పేరుందని, కానీ శుక్రవారం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఖైరతాబాద్‌ గణేశుడికి దేశ వ్యాప్తంగా ఉన్నంత పేరు తనకు కూడా వచ్చిందని చమత్కరించారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ ప్రజలు తనతోపాటే ఉన్నారని, ఉప ఎన్నికకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికల్లో పోరాడడం తనకు కొత్తేమీ కాదన్నారు. ఖైరతాబాద్‌ గణేశుడి తన వెంటే ఉన్నాడని ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 03:31 AM